సుధీర్ బాబు తాజాగా మామ మచ్చింద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేయనుండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ లో సుధీర్ బాబు తన కెరియర్ లో మొట్ట మొదటి సారి మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే  ఇందుకు సంబంధించిన పోస్టర్ లను కూడా విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ మూవీ తో సుదీర్ ఏ  రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: