తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన మహిళా దర్శకురాలిలో నందిని రెడ్డి ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ దర్శకురాలు సంతోష్ శోభన్ హీరోగా అన్ని మంచి శకునములే అనే మూవీ ని రూపొందించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇకపోతే ఈ దర్శకురాలు తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సిద్దు జొన్నలగడ్డ తో చేయబోతుంది.

ఇకపోతే ఇప్పటికే సిద్దు తో నందిని రెడ్డి చేయబోయే సినిమాలో సమంత ను హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ చిత్ర బృందం కూడా సమంత ను సిద్దు మూవీ కి మొదటి ఆప్షన్ గా కూడా అనుకుందట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సమంత ను కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశానికి ఈ మూవీ మేకర్స్ వచ్చినట్లు అందులో భాగంగా ఓ నటీమణి కోసం ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ వెతుకులాటలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం సిద్దు "టిల్లు స్క్వేర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించినటువంటి డిజె టిల్లు మూవీ కి ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతూ ఉండటంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: