సీరియల్స్ అంటే ఒకప్పుడు నటీమణులు చాలా సాంప్రదాయంగా పద్ధతిగా చీరలో కనిపించి ఆకట్టుకునేవారు. ఎమోషనల్ సన్నివేశాలతో కంటతడి పెట్టించే వారు. ఎలాంటి పాత్రలోనైనా సరే వేషధారణ చాలా పద్ధతిగా ఉండేటట్టు చూసుకునేవారు. కానీ గత కొన్నాళ్ల నుంచి సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ ఏ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమై ప్రముఖ సీరియల్ లో జగతి మేడమ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్ కొన్నాళ్ల ముందు వరకూ చీరలో కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈమధ్య తన గెటప్ ని పూర్తిగా మార్చేసి హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. 

సీరియల్స్ లో చీరకట్టుతో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో ఇంత హాట్ గా కనిపించడం చూసి అంతా షాక్ అయ్యారు. మరి జ్యోతి రాయ్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడానికి కారణం ఏంటో తెలుసా? సాధారణంగా లేడీ యాక్టర్స్ గ్లామర్ షో చేయడం కొత్తేమి కాదు. ఈమధ్య సీరియల్స్ లో ఇదొక ట్రెండ్ అయిపోయింది. కానీ సీరియల్ నటి జ్యోతి రాయ్ 40 ఏళ్లకు దగ్గరవుతుంది. ఆల్రెడీ పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది. సీరియల్ లో తల్లి పాత్రలు చేస్తున్నప్పటికీ తనలోని గ్లామర్ యాంగిల్ ని గత కొద్ది కాలంగా నెటిజన్స్ కు చూపిస్తూనే ఉంది. తన ఇన్ స్టా గ్రామ్ లో రోజుకు ఓసారైనా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

 ప్రస్తుతం సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో నటిస్తున్న జ్యోతి రాయ్ తాజాగా ఓటీటీ కోసం 'ప్రెట్టీ గర్ల్'(Pretty Girl) అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులోని పాత్ర కోసమే ఇన్నాళ్లుగా జ్యోతిరాయ్ తనలోని గ్లామర్ ని బయటపెట్టి తనను తాను మార్చుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. తాజాగా ఆ వెబ్ సిరీస్ తాలూకు ఫస్ట్ లుక్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. సీరియల్స్ లో పద్ధతిగా ఉండే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో ఇంతలా రచ్చ చేయడానికి కారణం ఇదా? అంటూ నెటిజెన్స్ అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: