టావీనో థామస్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి, లాల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 2018. ఈ సినిమా ఏడాది విడుదలై మలయాళం లోని సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల చేయడం జరిగింది. విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పలు రకాల అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ అవార్డులు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి స్థార్ డం అందుకున్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా నెదర్లాండ్లో  కూడా అందించే సేఫ్టిమిస్ అవార్డు కూడా బెస్ట్ ఆసియన్ యాక్టర్ గా హీరో టోవినో థామస్ ఎంపిక కావడం జరిగింది. బెస్ట్ ఆసియన్ ఫిలిం క్యాటగిరిలో కూడా ఈ చిత్రం నామినేట్ అయ్యాయి.. ఇక ఈ పురస్కారంలో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్నాడు టోవినో థామస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. తనకి ఇంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డు సొంతం అంటూ తెలియజేశారు హీరో థామస్.


అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆస్కార్ కి అధికారికంగా ఇండియా తరఫునుంచి వెళ్లేందుకు ఎంపిక అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ప్రభుత్వం ఆస్కార నామినేషన్ కోసం 2018 మూవీని అధికారికంగా పంపించబోతున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం. ఈ విషయం తెలిసి  చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నారు. గత ఏడాది RRR, ది ఎలిఫెంట్ అనే చిత్రాలు ఇండియాకి ఆస్కారాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ 2018 వ సినిమా ఈ ఏడాది ఆస్కార్బరిలో నిలుస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఈ సినిమా కేరళలోని 2018 లో వచ్చిన భారీ వరదలు నేపథ్యంలో తెరకెక్కించిన కథ కేరళలో బాక్సాఫీసు వద్ద పేరు కలెక్షన్లను సృష్టించింది ఈ సినిమా. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు  సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: