ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిత్రాలే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నాయి. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాలను అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీని మార్చేసిన చిత్రం జాతి రత్నాలు.. చిన్న సినిమాగా విడుదలై అందరిని కడుపుబ్బ నవ్వించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన వారందరికె కాకుండా డైరెక్టర్ కి కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టేలా చేసింది జాతి రత్నాలు సినిమా.


ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి కాన్సెప్ట్ తో మ్యాడ్ అనే సినిమాని తీసుకురాబోతున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ముఖ్యమైన పాత్రలో ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో పలువురు కొత్త వాళ్ళతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్మాట్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్  తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్లో చిత్ర బృందం తో పాటు నిర్మాత సూర్యదేవర నాగావంశి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు



ఈవెంట్ కి జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా రావడం జరిగింది.. ఇక నిర్మాత నాగావంశి మాట్లాడుతూ మీ జాతి రత్నాలు సినిమా కంటే ఒక్క శాతం ఈ సినిమా చూసి తక్కువగా ఎవరైనా నవ్వామని చెబితే వాళ్ళకి టికెట్ డబ్బులు రిటన్ ఇచ్చేస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇదే మాట ఆడియన్స్ కి కూడా చెప్పారు నాగ వంశీ.. మ్యాడ్ సినిమా చూసి జాతి రత్నాలు కంటే ఒక్క శాతం ఎవరైనా తక్కువగా నవ్వినట్లు తనకి ట్విట్టర్లో మెసేజ్ పెట్టండి మీ టికెట్ డబ్బులు ఇచ్చేస్తానంటూ తెలిపారు. దీంతో ఈ సినిమా హైప్ భారీగా పెరిగిపోతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: