చాలా సంవత్సరాల క్రితం పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయన తార హీరోయిన్ గా ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో చంద్రముఖి అనే మూవీ రూపొంది తమిళ , తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను రాబట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆ సినిమా ఆ సమయంలో సూపర్ సక్సెస్ కావడంతో ఆ మూవీ ని తెరకెక్కించిన పి వాసు తాజాగా రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమాకు కొనసాగింపుగా చంద్రముఖి 2 అనే మూవీ ని రూపొందించాడు.

ఇకపోతే ఈ సినిమాలో కంగనా రనౌత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించగా ... ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందించాడు. లేక ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను నిన్న అనగా సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్స్ డ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: