రియాలిటీ ఆధారంగా సాగుతూ తెలుగు బుల్లితెర  ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది బిగ్ బాస్ కార్యక్రమం. అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి రియాలిటీ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఈ షోని మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ కూడా వీక్షిస్తున్నారు. అయితే ఈసారి ఉల్టా ఫుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైన బిగ్బాస్ ఏడవ సీజన్.. అంచనాలకు మించి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ప్రతి టాస్క్ కూడా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.


 ఇక ఎప్పటిలాగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతూ.. హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ముగ్గురు లేడీస్ ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ రెండో వారంలో షకీలా మూడో వారంలో దామిని హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్ ఉల్టా పుల్టా అని నిర్వాహకులు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోని ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు ఊహించిన ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తుంది.


 అయితే బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా 5 వారాల తర్వాత బిగ్ బాస్ సీజన్ కొనసాగే తీరు పూర్తిగా మారిపోతుందని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. ఏకంగా హౌస్ లోకి మరో ఏడుగురు కంటెస్టెంట్స్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అందులో అర్జున్, యాంకర్ నిఖిల్, సింగర్ బోలె, పూజ, అంజలీల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒక రీ ఎంట్రీ కూడా ఉండబోతుందట. రీ ఎంట్రీ ఎవరో కాదు దామిని ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆమె కాకపోయినా ఐదు వారాల్లో బయటకు వెళ్లే వారిలో ఎవరో ఒకరిని మళ్లీ తీసుకువచ్చేందుకు  బిగ్ బాస్ టీం ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: