బ్లాక్ బస్టర్ చంద్రముఖి సీక్వెల్‌గా చంద్రముఖి 2 సినిమాను దర్శకుడు పీ వాసు తెరకెక్కించారు. లారెన్స్ , కంగన రనౌత్, మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డును అందుకొన్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సినిమాపై క్రేజ్ పెంచడంతో ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక చంద్రముఖి 2 సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు మొత్తం 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగానే జరిగింది. తమిళంలో 35 కోట్ల రూపాయలు ఇంకా తెలుగు రైట్స్ 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.చంద్రముఖి 2 సినిమా మొత్తం 45 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో థియేట్రికల్ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చంద్రముఖి 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగానే స్పందన వచ్చింది.


 ఈ సినిమా ఓవర్సీస్‌లో 100K డాలర్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్‌గా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చంద్రముఖి 2 సినిమా భారీగానే వసూళ్లు నమోదు చేసింది. తొలి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 45 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వస్తుందో వేచి చూడాలి.ఈ సినిమాను తమిళనాడులో 500 స్క్రీన్లలో ఇంకా తెలుగులో 250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 54 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం ఇంకా సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో మొత్తం 70 శాతం ఆక్యుపెన్సీ, మధురైలో 60 శాతం, పాండిచ్చేరిలో 82 శాతం, వెల్లూరులో 70 శాతం ఇంకా త్రిచీ 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.ఇక తెలుగు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: