ప్రముఖ టాలీవుడ్ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమా లలో హీరోయిన్ గా, మరికొన్ని సినిమా లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పూర్ణ ఇప్పటి కీ వరుస ఆఫర్లను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.నాని దసరా మూవీ షూట్ సమయం లో నేను గర్భవతినని ఆ సమయం లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని పూర్ణ చెప్పుకొచ్చారు. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిమ్ అనే సంగతి తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీ లో పూర్ణకు ప్రత్యేక గుర్తింపు ఉండగా మలయాళ ఇండస్ట్రీ ద్వారా పూర్ణ కెరీర్ ను మొదలు పెట్టారు. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల పై దృష్టి పెట్టిన పూర్ణ ఈ భాషలలో కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యారు. పూర్ణ మంచి డ్యాన్సర్ కూడా కావడం తో పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించే అవకాశం దక్కింది. బుల్లితెర షోల ద్వారా పూర్ణ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

పూర్ణ తాజాగా పండంటి బిడ్డ కు జన్మనిచ్చారు. దసరా మూవీ కొరకు రెండు రోజుల పాటు వర్షం లో షూటింగ్ లో పాల్గొన్నానని పూర్ణ తెలిపారు. ఆ సమయం లో చలి ఎక్కువ గా ఉండటం వల్ల ఇబ్బంది పడ్డానని పూర్ణ కామెంట్లు చేశారు. గర్భవతిని అయిన సమయం లో చల్లనీళ్లు తాగడం వల్ల మరింత నష్టం కలిగిందని ఆమె పేర్కొన్నారు. దసరా కోసం అంత కష్టపడినా నేను నటించిన కొన్ని సీన్స్ డిలీట్ అయ్యాయని పూర్ణ పేర్కొన్నారు.నా ఇబ్బందిని గమనించి దసరా మేకర్స్ నాపై వేడినీళ్లను పోశారని పూర్ణ చెప్పుకొచ్చారు. దసరా సినిమాలోని మరో సీన్ కోసం నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తానని పూర్ణ కామెంట్లు చేశారు. ఆ సమయంలో వీధికుక్కల అరుపులు విని భయపడ్డానని పూర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: