టాలీవుడ్ లో హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. రవితేజ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా ఉందని చెప్పవచ్చు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం ఇటీవల వేగవంతం చేస్తోంది పలు రకాల పోస్టర్స్ తో పాటు పాటలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తోంది.


అయితే ఆశించిన స్థాయిలో బజ్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. టీజర్ మాత్రం ఇంటెన్సిటీ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 3వ తేదీన  ట్రైలర్ ని అన్ని భాషల విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే అక్టోబర్ 15న హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత కచ్చితంగా ఈ సినిమా పైన మంచి ఏర్పడుతుందని చిత్ర బృందం చాలా ధీమాతో ఉన్నారు.


ఏడాది రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య రావణాసుర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటారని నమ్మకాన్ని రవితేజ అభిమానులకు కలుగుతోంది ఇప్పటివరకు టైర్-2 హీరోలలో పాన్ ఇండియా మూవీ అనే బ్రాండ్ తగిలిస్తున్నారు తప్ప సరైన సక్సెస్ అందుకోలేదు. కేవలం ఓటీటీ లో మాత్రమే ఐదు భాషలలో విడుదల చేస్తున్నారు. మరి టైగర్ నాగేశ్వరరావు విషయంలోనైనా ఈ రూటు మార్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మరి ఇందులో ఎంత నిజమోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: