అందాల ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ 3 మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ నటికి తెలుగు లో కూడా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే సాయి మంజ్రేకర్ తెలుగు లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గని ... అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది.  ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమాకు పరవాలేదు అనే స్థాయిలో కలక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి మంజ్రేకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజాగా ఈ నటి నేను స్కంద మూవీ షూట్ లో పాల్గొని విరామం దొరికినప్పుడు చల్లగా కాస్త రెస్టు తీసుకుంటున్న సమయంలో సెట్స్ లో ఆకస్మాత్తుగా కొన్ని పేలుళ్లు సంభవించాయి. మరియు ఆ పేలుళ్లతో నేను వెంటనే అక్కడి నుండి పారిపోయాను అని చెప్పుకచ్చింది. ఇకపోతే ఈ పేలుళ్లు అన్ని స్కంద మూవీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి జరిగినవిగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం స్కంద మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: