అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాటి ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లోని నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో కేవలం నటనతో మాత్రమే కాకుండా తన అదిరిపోయే హాట్ హాట్ అందాలను ఆరబోసి ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మహేష్ హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ కి మరో స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ తన తదుపరి మూవీ ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 68 వ మూవీ గా రూపొందబోతుంది.

మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇకపోతే ఈ చిత్ర బృందం ఈ సినిమాలో విజయ్ కి జోడిగా మీనాక్షి చౌదరి ని తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కనుక ఈ బ్యూటీ కి అవకాశం దక్కినట్లు అయితే ఈ నటికి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: