ఏకంగా శ్రీదేవి, బోనికపూర్ పెళ్లి జరగడానికి ముందే ఇక వీరికి జాన్వీ కపూర్ పుట్టింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత బోనీకపూర్ గతంలో వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. 1996లో నేను శ్రీదేవి శిరిడీలో రహస్య వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి విషయం మీడియాకు తెలిసింది. 1977లో మరోసారి అందరి ముందు పెళ్లి చేసుకున్నాం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా కూడా చెప్పాము. తర్వాత ఎన్నో రూమర్లు మొదలయ్యాయి. ముఖ్యంగా జాన్వి కపూర్ మా పెళ్లికి ముందే పుట్టిందని.. కొన్ని మీడియాలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి.
ఇప్పటికీ కూడా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నిసార్లు ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. శ్రీదేవికి దేవుడిపై ఎంతో నమ్మకం ఉందని.. ఇక ఆమె ప్రతి పుట్టినరోజుకు తిరుమల వెళ్లే వాళ్ళం అంటూ చెప్పుకోవచ్చాడు. అలాగే ఇప్పుడు జాన్వి కపూర్ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా తిరుమల వెళ్తుందని బోనీకపూర్ చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవి డైట్ విషయంలో కాస్త కఠినంగా ఉండడంతో కొన్ని కొన్ని సార్లు నీరసంతో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు బోని కపూర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి