మహేష్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ ఆఖరుగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటించాడు. కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం మహేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత జనవరి 12 వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని దానితో ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కష్టమే అని ఈ సినిమాపై కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. కాకపోతే ఈ మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కచ్చితంగా విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్టును అక్టోబర్ 20 వ తేదీ వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: