అయితే ఈ కథనాలను షారూఖ్ ఖాన్ పిఆర్ టీమ్ ఖండిస్తూ తమకు ఏసీనిమాతో పోటీ ఉన్నా దానిని లెక్కచేయకుండా అనుకున్న డేట్ కు రావడం ఖాయం అంటూ లీకులు ఇస్తోంది. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈ రెండు సినిమాలకు సంబంధించి బుక్ మై షోలో రికార్డు అవుతున్న ఇంటరెస్ట్ వ్యవహారాలు చూస్తే కొంతమంది షాక్ అవుతున్నారు.
‘సలార్’ కు ఇప్పటిదాకా 3 లక్షల 62 వేల 800 మంది చూడబోతున్నాము అంటూ తమ ఆసక్తిని ప్రదర్శిస్తే ‘డుంకీ’ ని మాత్రం కేవలం 76 వేల 700 మాత్రమే తాము చూడటానికి ఆశక్తిగా ఉన్నాము అంటూ తమ ఆసక్తిని రికార్డు చేయడంతో ఈవిషయంలో షారూఖ్ ను ప్రభాస్ డామినేట్ చేస్తున్నాడు అనుకోవాలి. ఈసినిమాలు తరువాత మూడవ స్థానంలో రణబీర్ కపూర్ ‘యానిమాల్’ 39 వేల 800 ‘కెప్టెన్ మిల్లర్’ 15 వేల 200 మందితో తరువాత స్థానాలలో కొనసాగుతూ ఉండటంతో ప్రస్తుతానికి షారూఖ్ ఖాన్ కంటే ప్రభాస్ ముండదుగులో ఉన్నాడు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈనెలలో రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజునాడు ‘సలార్’ మూవీకి సంబంధించిన మరొక టీజర్ ను విడుదల చేసి ఈమూవీ మ్యానియాను మరింత పెంచాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచన అని అంటున్నారు. అంచనాలకు అనుగుణంగా ‘సలార్’ ఈపోటీలో ఘనవిజయం సాధించగలిగితే ప్రభాస్ పేరు బాలీవుడ్ హోరెత్తి పోయే ఆస్కారం కనిపిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి