ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఏ సినిమాలు అనే విషయాలను తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రామ్ చరణ్ , సునీల్ మరియు కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ పై ఈ మూవీ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు నాగార్జున పై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం నితిన్ మరియు కొంత మంది ఇతరులపై రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: