కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ నటించిన లేటెస్ట్ సినిమా చంద్రముఖి 2. రాఘవ లారెన్స్ గంగన రణౌత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాని పి వాసు తెరకెక్కించడం జరిగింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ తెరకెక్కడం, హారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాఘవ లారెన్స్ ఈ సీక్వెల్ లో భాగమవడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.
సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ని అందుకుంది. తమిళంలో తప్పితే మిగతా భాషల ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం. సినిమాలో లారెన్స్జ్ కంగనా నటనపరంగా ఆకట్టుకున్నా కథ, కథనంలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపించలేదు. దీంతో విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. 'చంద్రముఖి 2' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు అక్టోబర్ 27న 'చంద్రముఖి 2' నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. కానీ ఆ తేదీన కాకుండా ఒక్కరోజు ముందుగానే మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. అక్టోబర్ 26 నుంచే ఈ 'చంద్రముఖి 2' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. మరోవైపు 'చంద్రముఖి 2' ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ అందుకున్నా సినిమా వల్ల నిర్మాతలకి పెద్దగా నష్టాలేవి రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి