సౌత్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు కమలహాసన్ తో ఇండియన్ టు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ముందుగా గేమ్ చేంజర్ సినిమాని వేగంగా చేసిన శంకర్ మధ్యలోనే ఆపేసి ఇండియన్ టు సినిమా చేయాల్సి వచ్చింది. ఒక నెలలో ఇండియన్ టు షూటింగ్ ను 15 రోజులు చేస్తే మరొక 15 రోజులు గేమ్ చేంజర్ సినిమాని చేసాడు. శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మల్లి ఇప్పుడు గేమ్ చేంజెస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు శంకర్. ఇటీవల పది రోజుల షెడ్యూల్ ని కూడా పూర్తి చేయడం జరిగింది. 

దాంతోపాటు వచ్చే నెలలో హైదరాబాదులో రెండు వారాలపాటు నాన్ స్టాప్ గా షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో దాదాపుగా 80% షూటింగ్ పూర్తయినట్లే అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే శంకర్ సైతం ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆ మధ్యలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స ఎంతలా పాపులర్ అయిందో తెలిసింది. శంకర్ సైతం ప్రస్తుతం దీన్ని ఫాలో అవుతున్నాడు.

ఇండియన్ టు క్లైమాక్స్ లో రామ్ చరణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక  గేమ్ చేంజర్ లోని రామ్ చరణ్ పోషించిన ఐఏఎస్ పాత్ర అని అంటున్నారు చాలామంది. అలాగే గేమ్ చేంజర్ పాత్రని ఇండియన్ టు ద్వారా పరిచయం చేయాలి అని శంకర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాని తర్వాత గేమ్ చేంజర్ సినిమాకి కొనసాగింపుగా ఇండియన్ త్రీ సినిమా సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ మూడు సినిమాలు కూడా ఖచ్చితంగా 1000 కోట్లకు పైగానే వసూళ్లను రాబడతాయి. ఇలా రాబోయే రోజున మొత్తం సినిమాటిక్ యూనివర్సల్ ట్రెండ్ తో హల్ చల్ జరగబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: