
గత కొద్ది రోజులుగా యానిమల్ సినిమా రన్ టైమ్ సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యానిమల్ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్లు ఉంటుంది.. అంటు డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. ఈ టైమింగ్ చూసిన నెటిజెన్స్ అభిమానులు సైతం చాలా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఇంత టైమింగ్ ఉన్న సినిమాలు విడుదలే కాలేదట గతంలో 2016లో కేవలం ధోని సినిమా మూడు గంటల పది నిమిషాలు మాత్రమే రన్ టైం తో విడుదల అవ్వడం జరిగింది.
దాదాపుగా మూడున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లో ఉంచేలా చేయడం అంటే అది కష్టమని చెప్పాలి.. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి కథపై ఉన్న నమ్మకంతో ఈ రన్ టైమ్ ని కుదించలేనని తెలియజేసినట్లు తెలియజేశారు. తెలుగులో తీసిన అర్జున్ రెడ్డి సినిమా సైతం మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా ఇదే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఓటీటి లో ఈ సినిమా రన్ టైం గురించి తొలి వార్తలు వినిపిస్తున్నాయి ఓటిటి వర్షన్ కి వచ్చేసరికి ఈ సినిమా కేవలం 2:30 నిమిషాలు మాత్రమే కలిగి ఉంటుందని సమాచారం.