ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఆర్య 2 సినిమాకి ఎలాంటి ప్రత్యేకత ఉందో తెలిసిందే. ఆర్య తో స్టార్ డం అందుకున్న బన్నీ 'ఆర్య 2' తో స్టైలిష్ స్టార్ గా మారాడు. టాలీవుడ్ లో ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా ఆర్య 2 మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి ఈ మూవీ తాజాగా 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 'గంగోత్రి' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కి 'ఆర్య' మూవీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కేవలం తెలుగులోనే కాదు మలయాళం లోనూ బన్నీ స్టార్ హీరోగా ఎదగడానికి ఈ మూవీ ఎంతో ఉపయోగపడింది.

 'ఆర్య' వచ్చిన ఐదు సంవత్సరాలకు నా సినిమాకు సీక్వెల్ గా 'ఆర్య 2' రిలీజ్ అయింది. 2009 నవంబర్ 27న విడుదలైన 'ఆర్య 2' 2023 నవంబర్ 27 తో విజయవంతంగా 14 సంవత్సరాల పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఆర్య 2' మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆర్య 2 సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరిచిన బన్నీసినిమా తనకు చాలా స్పెషల్ అని, మనసుకు దగ్గరైన చిత్రమని అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. 

దీంతో బన్నీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 'ఆర్య 2' తర్వాత మళ్లీ బన్నీ - సుకుమార్ కాంబోలో పుష్ప ది రైజ్ మూవీ తెరకెక్కింది. 2021 చివరలో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా హీరోగా మారాడు. అంతేకాకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా 'పుష్ప2' తెరక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: