రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న యానిమల్ సినిమా కోసం సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'యానిమల్' పై తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ నెలకొంది. 'యానిమల్' తీసింది తెలుగు దర్శకుడే కావచ్చు. కానీ అందులో హీరోతో సహా పలువురు కీలక పాత్ర పోషించిన నటీనటులు బాలీవుడ్ కు చెందిన వాళ్లే  సినిమాను నిర్మించింది కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థ. 'యానిమల్'  స్టోరీ, బ్యాక్ డ్రాప్ అన్ని నార్త్ ఫ్లేవర్ తోనే ఉండనున్నట్లు ట్రైలర్ 

చూసిన వాళ్లకు అర్థమైంది. ముఖ్యంగా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసింది. దీంతో ఓ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో అంతలా యానిమల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమాపై వాళ్ళ క్యూరియాసిటీ ఏ రేంజ్ లో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూనే అర్థమైపోతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం 'యానిమల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల నుంచే షోలు పడుతున్నాయట. అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ తో యానిమల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లో సందడి చేయబోతోంది. అంతేకాదు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ కు 

సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ లో ఎంత ఎర్లీగా పెడితే అంత ఫాస్ట్ గా బుక్ అయిపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయంటే యానిమల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ AMB సినిమాస్ లో అయితే ఇప్పటికే నాలుగు షోలకు టికెట్లు పడితే కొన్ని గంటల్లో అన్ని అమ్ముడుపోయాయి. ఇంకా కొన్ని షోలు ఫాస్ట్ ఫీలింగ్ మోడ్ లో ఉన్నాయి. బహుశా ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకు తెలుగులో ఇలా జరగలేదేమో. 'యానిమల్' కి తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ రావడానికి సందీప్ రెడ్డి వంగ ఓ కారణమైతే రష్మిక మందన మరో రీజన్ అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: