బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కొంత కాలం క్రితం వార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ కీలకమైన పాత్రలో నటించాడు. వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ.కి కొనసాగింపుగా ప్రస్తుతం "వార్ 2" అనే మూవీ ని రూపొందిస్తున్నారు.

మూవీ లో హృతిక్ రోషన్ హీరోగా కనిపించనుండగా ... టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని 2025 వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో ఈ చిత్ర బృందం అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వార్ మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడం అలాగే ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ కీలక పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: