విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ తాజాగా రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు సందీప్ వరస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో ... టాక్ షో లలో పాల్గొంటూ యానిమల్ మూవీ ని అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సందీప్ ఇప్పటికే యానిమల్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ ని రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన స్పిరిట్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ... స్పిరిట్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వచ్చే సంవత్సరం జూన్ నెల నుండి ప్రారంభం కాబోతున్నాయి అని ... అలాగే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుండి స్పిరిట్ మూవీ షూటింగ్ దాదాపుగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగే 2025 క్రిస్మస్ లేదా 2026 సంక్రాంతి.కి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము అని ... ఈ మూవీ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని సందీప్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: