తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే విజయ్ ... పరుశురామ్ కాంబో లో ఇప్పటికే గీత గోవిందం అనే సినిమా రూపొంది అద్భుతమైన విజయం సాధించింది. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రూపొందిన గీత గోవిందం మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి ఫ్యామిలీ స్టార్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ.లో మృనల్ ఠాకూర్ ... విజయ్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కాకపోతే సంక్రాంతి కి ఇతర సినిమాల నుండి పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ బృందం తాజాగా న్యూ ఢిల్లీ లో వెడ్డింగ్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సాంగ్ ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ సంబంధించిన లిరికల్ వీడియోను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బంధం ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని ద్వారా కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మరింత రెస్పాన్స్ లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: