తెలుగు ... తమిళ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అదిరిపోయే రేంజ్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే గత కొంత కాలం క్రితం వరకు వరుస అపజాయలతో డీలా పడిపోయిన ఈ నటి ఈ సంవత్సరం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ తో మంచి విజయాన్ని అందుకని తిరిగి కం బ్యాక్ అయింది. ఇక ఆ తర్వాత ఉదయానిధి స్టాలిన్ హీరోగా రూపొందిన మమన్నన్ సినిమాతో తమిళ ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమలో మంచి విజయాలను ఈ సంవత్సరం అందుకున్న ఈ బ్యూటీ చేతులో ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

అవి ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ బ్యూటీ జయం రవి హీరోగా రూపొందుతున్న సైరన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ మాత్రమే కాకుండా రఘు దాదా ...  రెయిన్ బో అనే రెండు సినిమాలలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ప్రస్తుతం హిందీ శని పరిశ్రమలో ఓ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇందులో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. వీటితో పాటు కీర్తి సురేష్ హిందీ లో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే కీర్తి సురేష్ నటించబోయే మొట్ట మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ అనేక క్రేజీ ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: