
"ది గోట్ లైఫ్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్. ఈ కథను వీలైనంత సహజంగా చూపించడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా చేసిన రచన ఇది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలను ప్రేక్షకులకు వాస్తవిక అనుభూతిని కలిగించేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ది గోట్ లైఫ్ సినిమాను పలు దేశాల్లోని లొకేషన్స్ లో లార్జ్ స్కేల్ లో రూపొందించాం. ఇలాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ అనుభూతి కలుగుతుంది" అని డైరెక్టర్ బ్లెస్సీ తెలిపారు.ఇదిలా ఉంటే విలక్షణ పాత్రలతో తనదైన నటనతో మెప్పించే నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషీయమ్, జనగణ, బ్రో డాడీ వంటి చిత్రాలతో తెలుగులోను మంచి పేరు సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్.