న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది.. మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో నవంబర్ 29న హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తిర కామెంట్స్ చేసింది. "సీతారామం సినిమాకు ఇక్కడి వచ్చాను. ఇప్పుడు హాయ్ నాన్న కోసం ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీత పాత్రని ప్రేక్షకులు చాలా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు హాయ్ నాన్నలో యష్ణ పాత్రకు కూడా అదే అభిమానం చూపిస్తున్నారు" అని మృణాల్ తెలిపింది.

"ఒక తెలుగు అమ్మాయిలా నన్ను ఆదరిస్తున్న మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. హాయ్ నాన్న  బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్నని ఎంతో అద్భుతంగా మలిచారు. బేబీ కీయరా నటన ప్రేక్షకుల మనసుని హత్తుకుంటుంది. నాని గారు వండర్ ఫుల్ కో స్టార్. ఈ పాత్ర చేస్తునప్పుడు చాలా విలువైన సూచనలు నాకు ఇచ్చారు. చాలా గొప్పగా సపోర్ట్ చేశారు" అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో ప్రియదర్శి, విరాజ్ ఇలా టీం అందరితో షూటింగ్ చాలా సరదాగా జరిగింది. హేషమ్ వహాబ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో సమయమా, అమ్మాడి పాటలు నా ఫేవరేట్ సాంగ్స్ . ఇందులో తండ్రికూతురు అనుబంధం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు కచ్చితంగా వారితో ప్రేమలో పడిపోతారు. అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా అంటూ మృణాల్ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: