తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరో గా కొనసాగుతున్న అల్లరి నరేష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో కేవలం కామెడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు అల్లరి నరేష్. ముఖ్యంగా అతని కెరియర్ లో వచ్చిన సుడిగాడు లాంటి సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాలకు పెద్దగా ప్రేక్షకాదరణ లేకపోవడంతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తున్నాడు.


 అయితే అల్లరి నరేష్కు గత కొన్నెళ్ల నుంచి సరైన హిట్ అనేది లేకుండా పోయింది అని చెప్పాలి. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న.. ఈ సినిమాలు హిట్ అవడం లేదు. అయితే కేవలం హీరోగా నటించడం మాత్రమే కాదు ఇతర హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ క్రమంలోనే ఏకంగా ఎన్టీఆర్ - అల్లరి నరేష్ కాంబోలో ఒక సినిమా మిస్సయింది అన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా చేయడానికి ఓ డైరెక్టర్ తెగ ప్రయత్నాలు చేశాడట.


 ఆ డైరెక్టర్ ఎవరో కాదు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో మహేష్ ఫ్రెండ్ గా నాకు కనిపిస్తాడు అల్లరి నరేష్. అయితే ఈ మూవీలో ముందుగా మహేష్ బాబు పాత్ర కోసం ఎన్టీఆర్ ని అనుకున్నాడట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. కథ కూడా వినిపించాడట. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో తారక్ చేస్తే జనాలకు బాగా నచ్చుతుందని డైరెక్టర్ అనుకున్నారట. కానీ తారక్ అప్పుడు బిజీగా ఉన్నాడు. దీంతో తారక్ తో సినిమా తీయాలి అంటే మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి. దీంతో అంత సమయం వెయిట్ చేయలేక వంశీ పైడిపల్లి ఆ స్థానంలో మహేష్ బాబును తీసుకువచ్చాడు. అయితే డైరెక్టర్ ముందుగా అనుకున్నట్లుగానే హీరో ఫ్రెండ్ పాత్ర కోసం అల్లరి నరేష్ ను తీసుకొచ్చాడు. ఇలా తారక్ - అల్లరి నరేష్ కాంబో మూవీ మిస్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: