బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఒక పేరు తెలుగు బుల్లితెరపైనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా మమారు మోగిపోతుంది. అదే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి. అందరూ రైతుబిడ్డ అనే ట్యాగ్ ను వాడుకొని పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్ళాడు. అతన్ని వెంటనే ఎలిమినేట్ చేయాలి అనుకున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అతను ఆడుతున్న ఆటను చూసి ఇక ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో మిగతా కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే అతన్ని ఓటింగ్లో ప్రతి వారం కూడా టాప్ లో ఉంచుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు ఏడవ సీజన్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. పల్లవి ప్రశాంత్ ఇక ఈసారి టైటిల్ విన్నర్ గా నిలవడం ఖాయమని ఒక కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ కొట్టిన మొదటి కంటెస్టెంట్ గా అతను చరిత్ర సృష్టిస్తాడని.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే అతనికి ప్రేక్షకుల నుంచి మద్దతు కూడా లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ఆకట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్ కు.. ఇంకా హౌస్ నుంచి బయటికి రాకముందే ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


 పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో పల్లవి ప్రశాంత్ కి ఆఫర్ వచ్చిందట. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ బాస్ షోకి ఫ్యాన్ కావడంతో డైలీ ఫాలో అవుతూ ఉంటాడట. ఇక ఆయనకు ప్రశాంత్ గేమ్ నచ్చడంతో ఇక తాను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ప్రశాంత్ కి ఒక పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఒక వార్త తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా ఫినాలే ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి హరీష్ శంకర్ ఈ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా కోడైకూస్తుంది.  ఇక ఈ విషయం తెలిసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: