
సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన కేవలం 6 గంటల 4 నిమిషాల సమయం లోనే 1 మిలియన్ లైక్స్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... ఈ మూవీ కి రవి బూశ్రుర్ సంగీతం అందించాడు.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 7 గంటల 43 నిమిషాల సమయంలో 1 మిలియన్ లైక్స్ సాధించండి.
సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ 8 గంటల 49 నిమిషాల సమయంలో 1 మిలియన్ లైక్స్ ను సాధించింది.
భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 13 గంటల 29 నిమిషాల సమయంలో 1 మిలియన్ లైక్స్ ను సాధించింది.
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ హీరో గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 23 గంటల 39 నిమిషాల సమయంలో 1 మిలియన్ లైక్స్ ను సాధించింది.