బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్‌ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే పాత్రలో రెచ్చిపోయి నటించిన ఆమె ప్రభాస్ సరసన బంపర్ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.యానిమల్ మూవీలో చాలా వయోలెంట్ పాత్రలో కనిపించిన రణ్‌బీర్ కపూర్ తో ఓ సీన్ లో రొమాన్స్ పండించిన తృప్తి దిమ్రి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ సందీప్ తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం..రూ400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాలేదు.ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ తో ఎంతో బిజీగా వున్నాడు. ఆ మూవీస్ పూర్తి అయిన తర్వాత సందీప్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. అయితే తృప్తి ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి యానిమల్ మూవీలో జోయా పాత్ర కోసం కూడా సందీప్ రెడ్డి వంగా తృప్తిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాడట.

యానిమల్ సినిమాలో తృప్తి అదరగొట్టడంతో తన స్పిరిట్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో ఆమె పాత్ర ఏంటన్న విషయం పై ఇంకా స్పష్టత లేదు. స్పిరిట్ మూవీలో ప్రభాస్పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. యానిమల్ మూవీ కంటే ముందు తృప్తి దిమ్రి మామ్, పోస్టర్ బాయ్స్ మరియు లైలా మజ్నూలాంటి సినిమాలు చేసింది. అయితే యానిమల్ మూవీ తో ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.మరి ప్రభాస్ సినిమాతో పాటు మరో పెద్ద హీరో సినిమాలో కూడా ఈ భామకు ఛాన్స్ లభిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: