న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ 'హాయ్ నాన్న'.వైరా ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇక ఈ సినిమాలో నానికి కూతురుగా బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు జయరామ్ మరియు ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ వంటి ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేంజ్‌లో అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని భాషల్లో కలిపి హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ రూ. 37 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి  మాత్రం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.అలాగే, హాయ్ నాన్న హిందీ డబ్బింగ్ అండ్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ. 7.5 కోట్లు దక్కినట్లు సమాచారం. ఇలా రిలీజ్‌కు ముందే హాయ్ నాన్న మూవీ తో నిర్వాతకు భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా విడుదల తర్వాత మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ ఏడాది దసరా సినిమాతో నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో హాయ్ నాన్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: