ఓటీటీ లు అందుబాటులోకి వచ్చేసాక చిన్న సినిమా ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల అయి సందడి చేస్తున్నాయి.అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో విడుదల అయినా ఎప్పటికో గాని ఓటీటీలో స్ట్రీమింగ్ రావడం లేదు. ఇప్పటికే అలా చాలా సినిమా లు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఆ సినిమాలు విడుదలైన రెండు నుంచి మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి.కానీ ఇప్పుడు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింస.. ఈ సినిమా జూన్‏లో రిలీజ్ అయి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ కన్నా ముందే టీవీ లో కూడా వచ్చేసింది..భారీ హైప్ తో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కానీ రిలీజ్ మాత్రం చేయలేదు. సెప్టెంబరులో ఈ మూవీ టీవీల్లోకి కూడా వచ్చేసింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. కానీ తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు ఆరు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో అహింస మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు మరియు పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి సోదరుడు అయిన దగ్గుబాటి అభిరామ్ ఈ మూవీతో హీరోగా టాలీవుడ్ కీ ఎంట్రీ ఇచ్చాడు.నిర్మాత సురేష్ బాబు డైరెక్టర్ తేజ కు దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ భాద్యతలు అప్పగించారు. ఈఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదలైన అహింస  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో అభిరామ్ సరసన గీతికా తివారీ హీరోయిన్ గా నటించగా ఆర్పీ.పట్నాయక్ మ్యూజిక్ అందించారు.మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: