తెలుగులో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక బోల్తా కొట్టేసింది. ఇలా మాచర్ల నియోజక వర్గం మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ యువ నటుడు తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

మూవీ డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్ లను బుక్ మై షో మరియు పేటీఎం యాప్ లలో ఓపెన్ అయినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహ పరిచిన వక్కంతం వంశీమూవీ తో మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: