తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉదయ నిధి స్టాలిన్ తాజాగా మామన్నన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మారి సెల్వరజ్ దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్మూవీ లో ఉదయ నీది స్టాలిన్ కి జోడిగా నటించింది. వడివేలు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా మొదట తమిళ్ లో ఈ సంవత్సరం జూన్ 29 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ కలక్షన్ లను వసూలు చేసింది.

ఇక తమిళ్ లో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు లో నాయకుడు పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా కోలీవుడ్ ... టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ తెలుగు వర్షన్ మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వరల్డ్ విజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: