నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమా హాయ్ నాన్న.  ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ను నూతన దర్శకుడు శౌర్యవ్ తెరకేక్కించారు. కాగా ఇందులో నటించిన బేబీ కియార కూతురు పాత్రలో మెప్పించింది. వైరా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల అయింది. టీజర్ ట్రైలర్ తో భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు సినీ లవర్స్. హాయ్ నాన్న సినిమా ఎట్టకేలకు విడుదలై ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. సినిమా చూసిన సినీ లవర్స్ 

అందరూ సినిమా చాలా బాగుంది అంటూ పాజిటివ్ రెస్పాన్స్ కనబరుస్తున్నారు. ఏ ఏరియాలో విన్నా కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినబడుతోంది. దీంతో హాయ్ నాన్న సినిమా చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా హాయ్ నాన్న సినిమాపై మెగా డాటర్ నిహారిక రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. హాయ్ నాన్న చిత్రం గురించి వర్ణించడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఇంత అద్భుతమైన సినిమాను చూస్తే మీకు మీరే మంచి

చేసుకున్నవారవుతారు. సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ నటన అద్భుతం. ఇక హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సంగీతం ఆడియన్స్ హృదయాలను హద్దుకుంటుంది. డైరెక్టర్ శౌర్యువ్.. ఇకనుండి ఈ పేరు ఇండస్ట్రీలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నేను అబద్దం చెప్పడం లేదు.. ఇదే విషయాన్ని ఆల్రెడీ శౌర్యువ్ కి కూడా చెప్పాను.. అంటూ రాసుకొచ్చారు నిహారిక. దీంతో నిహారిక హాయ్ నాన్న సినిమాపై ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక నిహారిక విషయానికి వస్తే.. ప్రస్తుతం పలు సినిమాలను అలాగే సిరీస్ లను నిర్మిస్తోంది నిహారిక. దాంతోపాటు ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో సైతం నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: