జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ  దగ్గరైన ప్రియమణి గురించి.. సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలో నటించి ఆకట్టుకుంది అని చెప్పాలి. తెలుగులోనే కాదు తమిళ కన్నడ సినిమాలో కూడా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. పరుత్తి వీరన్ అనే సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా దక్కించుకుంది.


 అయితే ఇక ఒకానొక సమయంలో అటు తెలుగులో ఇటు తమిళంలో కూడా ప్రేమని ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే కేవలం గ్లామర్ రూల్స్ మాత్రమే కాదు ఎంతటి డి గ్లామర్ రోల్ లో నటించడానికి అయినా సిద్ధంగా ఉండేది. దీంతో ఇక ప్రత్యేకంగా ప్రియమణి కోసం కొన్ని పాత్రలు తలుపు తడుతూ ఉండేవి అని చెప్పాలి. ఇక ఆ తర్వాత కాలంలో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీగానే గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.


 అయితే మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈఓ అయినా ముస్తఫా రాజ్ నూ ప్రియమణి పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు అప్పటికే మరో మహిళతో పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారని తెలిసిన.. ఇక ప్రేమించి మరి అతన్ని పెళ్లాడింది. అయితే తన భర్త తనని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు అంటూ ప్రియమని చెబుతూ ఉంటుంది. కానీ ఇక ప్రియమణికి అటు సవతి పోరు మాత్రం తప్పడం లేదు అంటూ టాక్ ఉంది. ప్రియమణి, ముస్తఫా మీద మొదటి వైఫ్ కేసు పెట్టిందంటూ అప్పట్లో ఒక వార్త తెరమీదకి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రస్తావన రాగా అలాంటిదేమీ లేదని పుకార్లకు చెక్ పెట్టింది ప్రియమణి. అలాంటివన్నీ క్లియర్ చేసుకున్నాకే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: