ఈ మధ్య ఎక్కువగా రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు పలు యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్ పలు సుదీర్ఘ పోస్టులు పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో కేవలం 7 నిమిషాల్లోనే 13 సార్లు తన పేరు తీశాడంటూ ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సీనియర్ జర్నలిస్టుకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ మేరకు తాను సింగిల్ ఉమెన్ గా సాధించిన ఘనతలను ఓ పోస్ట్ ద్వారా పేర్కొంది.

" సుమారు 30 యాడ్స్ లో నటించాను. తెలుగు, తమిళంలో మూడు సినిమాలు చేశాను. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నేనే. స్కూల్, కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ని. టీవీ షోలో సక్సెస్ఫుల్ జడ్జి. సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్. డైరెక్టర్, ప్రొడ్యూసర్... ఇలాంటి ఘనతలు సాధించిన నా గురించి నాకు తెలియని ఓ వ్యక్తి నా జీవితంలో నేను ఏం చేయాలనేది చెబుతున్నాడు" అంటూ అతనిపై ఫైర్ అయింది రేణు దేశాయ్. అంతేకాకుండా.." అంకుల్ మీరు నా నామస్మరణం చేసి న్యూస్ సంపాదిస్తున్నారు. నా పేరు వల్ల మీకు కొంత డబ్బులు వస్తున్నాయంటే అందుకు నేను సంతోషిస్తాను. 

నీ ఓన్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ తో నువ్వు డబ్బులు సంపాదిస్తే అది చాలా బాగుంటుంది. కానీ సింపుల్ గా చైర్ లో కూర్చుని ఫిలిం యాక్టర్స్ గురించి గాసిప్స్ చెబుతూ డబ్బులు సంపాదిస్తున్నావ్. అంకుల్, మీ ఈ సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తుంది. అంకుల్, నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు. నా గురించి మీకేం తెలీదు. కానీ నా గురించి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు దుర్గాదేవి, కాళీమాత వంటి శక్తివంతులని భావించే మన కల్చర్ లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లు వేస్ట్ అంటూ మీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి నేర్పిస్తున్నారు" అంటూ మరో పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: