యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా నుంచి త్వరలోనే టీజర్ రాబోతోందట. అది కూడా ఈ నెలలోనే అని సమాచారం. డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'దేవర' కూడా ఒకటి. 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

 ఈసారి వీరిద్దరి కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా 'దేవర' రాబోతోంది. అనౌన్స్మెంట్ తోనే ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో కొరటాల శివ ఈ మూవీని ప్లాన్ చేశారు. మొదటి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే చిత్ర టీజర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ టీం టీజర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

 డిసెంబర్ 20 లోపు దేవర టీజర్ ని రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రభాస్ సలార్, షారుక్ ఖాన్ డంకీ సినిమాలకి దేవర టీజర్ ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు. డంకీ, సలార్ సినిమాలకి దేవర టీజర్ ని అటాచ్ చేస్తే ఇండియా వైడ్ గా అన్ని భాషల ఆడియన్స్ కి మరింత రీచ్ అవుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే టీజర్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు ఎంట్రీ ఇస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: