మామూలు కథను చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్స్‌ట్రార్డనరీగా తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకరు.ఆయన మొదటిసారిగా డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా తీసుకుంటే, అందులో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ తన జూనియర్ ని ప్రేమిస్తాడు. అమ్మాయి తండ్రి అందుకు ఒప్పుకోడు. క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్తాడు. తర్వాత హీరో పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం, చివరికి మళ్లీ తన లవర్ ను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.ఇది చాలా సింపుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమా తీసిన స్టైల్ కుర్రకారును బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ మూవీ సన్సేషనల్ హిట్ గా నిలిచింది.ఈ కథ విని ఏ నిర్మాత కూడా సందీప్ రెడ్డి కోసం డబ్బును వెచ్చించడానికి సిద్ధం కాలేదు. చివరికి సందీప్ తన 32 ఎకరాలను అమ్ముకొని ఈ మూవీ తీసి చాలా లాభాలను సొంతం చేసుకున్నాడు. నిజానికి సందీప్ ఈ సినిమాని శర్వానంద్ వంటి స్టార్ హీరోలకు మొదటగా వినిపించాడు కానీ ఈ మూవీ మంచి హిట్ అవుతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు.

అలా సందీప్ ప్రతిభను అంచనా వేయడంలో హీరోలతో పాటు నిర్మాతలు కూడా పూర్తిగా విఫలమయ్యారు.  సందీప్ సినిమాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. అందుకే అది హిట్ అవుతుందా, లేదంటే విమర్శలు పాలవుతామా అన్న సందేహం చాలా మంది స్టార్ హీరోలకు ఉంటుంది. యానిమల్ సినిమా కూడా బోల్డ్ సీన్స్ తో ఒక అడల్ట్ కంటెంట్ లాగా ఉంటుంది. అందువల్ల తెలుగులో ఏ హీరో కూడా ఈ సినిమా తీసేందుకు ఒప్పుకోలేదు.కట్ చేస్తే ఈ మూవీ ఇప్పుడు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నతో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికే రూ.700కు పైగా కోట్లు వసూలు చేసింది.ఈ సినిమాని విమర్శించే వారు ఏ స్థాయిలో ఉన్నారు ప్రశంసించే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నిజ జీవితంలో మనుషులు ఎలా ఉంటారో అచ్చం అలాగనే ఈ సినిమాలో సందీప్ చూపించాడు అందుకే ఇది చాలామందికి బాగా కనెక్ట్ అయ్యింది. చదువుకున్న వాళ్ళు కూడా దీనిని పొగుడుతున్నారు. మొత్తం మీద ఒక ప్రత్యేక ప్రతిభను కలిగి ఉన్న సందీప్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇప్పుడు అందరి దృష్టిని తన వైపే తిప్పుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: