అయితే నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అన్నయ్య పెళ్ళిలో నిహారిక బాగానే సందడి చేసింది.అన్నయ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నిహారిక జోష్ మరింతగా పెరిగినట్లు ఉంది. అదిరిపోయే గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తోంది. నెటిజన్లు అంతా ఇంటికి వదినమ్మ వచ్చిన సంతోషమా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా నిహారిక థాయిలాండ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. నిహారిక థాయ్ లాండ్ అడవుల్లో ఏనుగులతో జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. నిహారిక ఏనుగులని బుజ్జగిస్తూ వాటికీ స్నానం చేయిస్తున్న దృశ్యాలు నెటిజన్లని ఎంతగానో అలరిస్తున్నాయి.నిహారిక అవకాశం దొరికితే సినిమాల్లో సైతం రాణించాలని చూస్తోంది. అయితే క్రేజీ ఆఫర్స్ మాత్రం ఈ మెగా డాటర్ కి దక్కడం లేదు. నిహారిక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనే ఫోకస్ పెట్టింది.నిహారిక తరచుగా తన ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు వరుణ్ సందేశ్ సతీమణి వితిక తో వెకేషన్స్ లో కనిపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి