ఇన్నాళ్లు చాలా పద్ధతిగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన కృతి శెట్టి ఇక మీదట అన్నిటికీ ఓకే అనేస్తుంది. ఇంతకుముందు అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా స్కిన్ షో చేయని కృతి శెట్టి ఈమధ్య ఫోటో షూట్స్ లో విపరీతమైన షో చేస్తుంది. దాదాపు సినిమాల్లో కూడా ఇలా గ్లామర్ షో చేసేందుకు రెడీ అనేలా అమ్మడు హింట్ ఇస్తుంది. ఉప్పెన సినిమాలో చూసిన కృతి శెట్టికి ఇప్పుడు ఫోటో షూట్స్ లో రెచ్చిపోతున్న అమ్మడికి చాలా తేడా ఉంది.
సినిమా ఛాన్స్ లు రాకపోతే ఏ హీరోయిన్ అయినా సరే పద్ధతి మార్చాల్సిందే. అదే దారిలో కృతి శెట్టి కూడా తన పంథా మార్చాలని అనుకుంది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సినిమా ఒక్కటే ఉన్నా ఆ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ సినిమా హిట్ పడితే తెలుగులో మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లో రావాలని చూస్తుంది. కృతి శెట్టి మళ్లీ వరుస తెలుగు సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి