నటుడు శ్రీరామ్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే..ఈయనని కొంతమంది శ్రీరామ్ అని మరికొంతమంది శ్రీకాంత్ అని పిలుస్తూ ఉంటారు.అయితే ఈయన గతంలో కొన్ని సినిమాల్లో హీరోగా ఆ తర్వాత హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్ లలో కూడా చేశారు. ఈయన ఎక్కువగా తమిళ సినిమాల్లోనే హీరోగా చేశారు. అలాగే తెలుగులో ఒకరికి ఒకరు, రోజా పూలు వంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక అందరికీ గుర్తచ్చేలా చెప్పాలి అంటే వెంకటేష్ హీరోగా చేసిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ అంటే త్రిషని పెళ్లి చేసుకోబోయే పాత్రలో శ్రీరామ్ నటించారు.అలాగే విజయ్ హీరోగా చేసిన స్నేహితుడు మూవీలో కూడా శ్రీరామ్ నటించారు. అలాంటి శ్రీరామ్ తాజాగా పిండం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి ఈయన పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ నా పెళ్లిని హీరోయిన్ త్రిష చెడగొట్టాలని చూసింది అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు.
రీసెంట్గా శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఎవరినైనా హీరోయిన్ ని చూసి ఓరి దీని వేషాలో అని మీకు అనిపించిందా అని యాంకర్ అడగగా..నాకు హీరోయిన్ ఇలియానా ని చూస్తే అనిపించింది. ఎందుకంటే స్నేహితుడు సినిమా షూటింగ్ సమయంలో అందరం 7 లోపే వచ్చి షూటింగ్ సెట్ లో ఉంటే ఇలియానా మాత్రం 11,12 గంటలకి షూటింగ్ సెట్ కి వచ్చి మేకప్ లు,జుట్టు వేసుకునేది. అలా ఆమెని చూసినప్పుడు ఓరి దీని వేషాలో అనిపించింది.అలాగే నాకు ఇండస్ట్రీలో త్రిష మంచి స్నేహితురాలు..కానీ నేను వందనను పెళ్లి చేసుకునే సమయంలో వందన దగ్గరికి వెళ్లి అసలు వీడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటున్నావు..వాడొక పెద్ద వేస్ట్ గాడు.. వాడికి ఇంగ్లీష్ రాదు.. చదువు రాదు.. వాడిని ఎలా చేసుకుంటావు అని వందనకు చెప్పింది.ఆ టైంలో ఇదేంటి నా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి నా పెళ్లే చెడగొట్టాలని చూస్తుంది అని అనుకున్నాను అంటూ త్రిష గురించి చెప్పుకొచ్చారు నటుడు శ్రీరామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: