తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నయన తార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో తమిళ సినిమాలలో నటించింది. వాటి ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె వరస పెట్టి తెలుగు లో సినిమాలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నటించిన చాలా సినిమాలు తెలుగు నాట అదిరిపోయే రేంజ్ విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలం లోనే నయన తార టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. 

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస తమిళ సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం నయన తార కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె ఎన్ని సినిమాలలో నటించిన కానీ ఏ మూవీ ఈవెంట్ కు కూడా అటెండ్ కాదు. అలాగే ప్రమోషన్ లలో కూడా పాల్గొనదు. అప్పుడప్పుడు మాత్రమే ఏవైనా పెద్ద ఈవెంట్ లు ఉంటే వాటికి అటెండ్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడో కానీ బయటికి రాకపోవడంతో నయన తార ఏదైనా ఈవెంట్ కు వచ్చింది అంటే ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఆమె వైపే తిరుగుతూ ఉంటాయి. 

అందులో భాగంగా తాజాగా ఈమె ఓ అవార్డ్ ల ఫంక్షన్ కు అటెండ్ అయ్యింది. ఈ వేడుక కు నయన తార ఎల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించిన్ విచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన నయన తార ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: