టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు సైతం పోటీపడి మరి చేస్తూ ఉంటారు.. మహేష్ తో యాడ్స్ ప్రకటనలు చేసేందుకు కూడా ఎన్నో కంపెనీలు క్యూ కడుతూనే ఉంటాయి. మహేష్ సినిమాల సంపాదన కంటే యాడ్స్ ద్వారా సంపాదన ఎక్కువగా ఉంటుంది.ఈ సంపాదనతో ఒక ఊరిని కూడా దత్తకు తీసుకున్నారు అంతేకాకుండా ఎంతోమంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్సలు కూడా చేయిస్తూ తన విషయాల హృదయాన్ని చాటుతూ ఉంటారు మహేష్ బాబు.

ఇప్పుడు తాజాగా మరో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్ పే తన గొంతు సైతం మహేష్ బాబు అందిస్తున్నారు. ఫోన్ పే నుంచి బిల్ పేమెంట్ చేసేటప్పుడు మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అయితే త్వరలోనే ఈ వాయిస్ కి బదులుగా మహేష్ బాబు వాయిస్ వినిపించేలా ఫోన్పే సంస్థ ప్లాన్ చేసింది.. దీంతో శాంపుల్ గా మహేష్ బాబు వాయిస్ ని A1 తో జనరేట్ చేశారు.

అంటే ఇకపై ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో నగదు లావాదేవీలను మనం మహేష్ బాబు వాయిస్ తో వినవచ్చు.తెలుగులో మహేష్ బాబు వాయిస్ లాగానే ఇతర భాషలలో కూడా ఫోన్ పే ఒప్పందం కుదుర్చుకొని ఈ వాయిస్ను అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్లో బిగ్బి అమితాబచ్చన్, కన్నడలో కిచ్చా సుదీప్ మలయాళంలో మమ్ముట్టి వంటి వారితో ఈ వాయిస్ చర్చలు జరిపినారట. మహేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమా అని చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: