ఎన్టీఆర్ కి.. బాలయ్య కి మధ్య చిన్న గ్యాప్ ఉందని ఆల్రెడీ అనేక పుకార్లు ఉన్నాయి. తారక్ ని టిడిపి నుంచి దూరం పెట్టారు అంటూ కొందరు ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా రీ రిలీజ్ అయి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి ఆల్రెడీ టాలీవుడ్ లో కూడా మొదలైపోయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా అది పొలిటికల్ గా కూడా ప్రొజెక్ట్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి.. బాలయ్య కి మధ్య చిన్న గ్యాప్ ఉందని ఆల్రెడీ అనేక పుకార్లు ఉన్నాయి. తారక్ ని టిడిపి నుంచి దూరం పెట్టారు అంటూ కొందరు ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.నందమూరి ఫ్యామిలీ.. ఎన్టీఆర్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ అంతకంతకు పెరుగుతున్న తరుణంలో బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ పోటీ పడితే ఎలా ఉంటుంది ?సోషల్ మీడియాలో జరిగే ఆ రచ్చని ఊహించడం కూడా కష్టం. ఇప్పుడు ఇది జరగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

 నందమూరి బాలకృష్ణ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి చిత్రం మార్చి 2న రీరిలీజ్ కి సిద్ధమా అవుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఒక రోజు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం కూడా రీరిలీజ్ అవుతోంది. ఇది యాదృచ్చికంగా జరిగిందా.. లేక వాంటెడ్ గానే ప్లాన్ చేసారా అనేది క్లారిటీ లేదు.సింహాద్రి చిత్రం కూడా తారక్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఎన్నికల వేడి నెలకొన్న ఈ సమయంలో బాలయ్య, తారక్ ఈ రకంగా పోటీ పడడం ఊహించని విషయమే.నందమూరి అభిమానులు ఆల్రెడీ బాలయ్య ఫ్యాన్స్ గా.. తారక్ ఫ్యాన్స్ గా డివైడ్ అయ్యారనే ప్రచారం ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరి చిత్రాలు రీ రిలీజ్ లో పోటీ పడడం ఫ్యాన్స్ మధ్య లేనిపోని గొడవలు సృష్టించడమే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: