సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకులకు హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. అందరు హీరోయిన్లలా ఈమె అందాల ఆరబోత చేయలేదు.. అందరూ హీరోయిన్లలా ఈమె మితిమీరిన రొమాంటిక్ సీన్లలో నటించలేదు.. అందరు హీరోయిన్లలా ఎలాంటి వివాదాల జోలికి కూడా పోలేదు. కానీ అందరికంటే ఎక్కువగానే గుర్తింపుని సంపాదించుకుంది.


 అందాల ఆరబోతకి, బోల్డ్ సీన్స్ కి కాదు నటనకు ఇండస్ట్రీలో ప్రాముఖ్యత ఉంటుంది అన్న విషయాన్ని నిరూపించింది. మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే ఎన్నో భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులు హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే చాలు ఆ సినిమాలో కథ బలంగా ఉంటుందని ప్రేక్షకులు అనుకునే విధంగా ప్రభావితం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక డాన్సుల్లో తనకు తిరుగులేదు అని నిరూపించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇలా ఇండస్ట్రీ లో తనదైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవిపై మరో టాప్ హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాయి పల్లవి మంచి డాన్సర్. గతం లో ఆమె పాల్గొనే డాన్స్ షోలకి నేను జడ్జిగా వ్యవహరించాను. అప్పుడు ఆమె డాన్స్ ను చూస్తూ ఎంతగానో మైమరిచిపోయేదాన్ని అంటూ సమంత చెప్పుకొచ్చింది. కాగా సమంత చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. అయితే సాయి పల్లవి సమంత మాజీ భర్త నాగచైతన్యతో గతంలో లవ్ స్టోరీ సినిమాలో నటించగా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు తండేల్ మూవీలో కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: