క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా అనౌన్స్ చేసి సుమారు నాలుగేళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య సినిమా ఆగిపోయింది అనే న్యూస్ కూడా వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఏఎమ్ రత్నం పలు ఆసక్తికర అప్డేట్స్ అందించారు.

'హరిహర వీరమల్లు' సినిమా నుంచి దర్శకుడిగా క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ ని క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేయడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అవుట్ పుట్ చూసి పవన్ అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినా కూడా పవన్ కి నచ్చలేదని చెబుతున్నారు. ఇప్పుడు క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు, దానికి తోడు బడ్జెట్ సమస్యలు ఏర్పడడంతో సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు.

తాజాగా ఓ పబ్లిక్ మీట్ లో స్హరిహర వీరమల్లు' సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత ఏఎమ్ రత్నం. ఈ మేరకు సినిమా ఆగిపోయింది అనే మాట వాస్తవం కాదని చెబుతూ మరో అప్డేట్ ఇచ్చారు.." పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే ఓ 20 రోజులు ఆయన డేట్స్ ఎలాగోలా తీసుకుని సినిమా చేసే వాడిని. కానీ ఆయనతో చేసే సినిమా గుర్తుండిపోవాలి. ఇండియా లెవెల్ లో ఆయన ఏంటో తెలియాలి అనే స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాం. వైసీపీ మీడియా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. హరిహర వీరమల్లు సినిమాకి రెండో భాగం కూడా ఉంటుంది" అంటూ తెలిపారు. ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: