మలయాళ సినిమా ఇండస్ట్రీ లో చాలా చిన్న సినిమాగా విడుదల అయ్యి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తున్న మూవీ లలో మంజుముల్ బాయ్స్ మూవీ ఒకటి. ఈ మూవీ లో చాలా మంది నటులు నటించారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇకపోతే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ విడుదల తేదీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

మూవీ ని "ది బాయ్స్" అనే పేరు తో తెలుగు లో మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది ... టాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ ఏ రేంజ్ లో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ది బాయ్స్ అనే టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందింది. ఈ మూవీ అంతా మంచి సస్పెన్స్ గా ముందుకు సాగినప్పటికీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఈ సినిమా స్వరూపాన్ని మార్చే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ 20 నిమిషాలతో ఈ సినిమా అదిరిపోయే స్థాయికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: