ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే ఈయన నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలుకు దర్శకత్వం కూడా వహించి దర్శకుడు గా కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు గామి అనే ఓ వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా ... విద్యాధర్ అనే దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీనీ ... వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 6 వ తేదీన "జే ఆర్ సి" కన్వెన్షన్ ఫిలిం నగర్ , హైదరాబాదు లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs